‘వి’ సినిమాలో థమన్ హ్యాండ్

Thaman To Score Background score for V Movie

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘V’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. ఇప్పటీకే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పాటు.. టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో థమన్ కూడా ఒక హ్యాండ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక ఈ విషయాన్ని మోహన్ కృష్ణ అధికారికంగా తెలిపారు.

[custom_ad]

కాగా ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటిస్తుండగా.. సుధీర్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.అంతేకాదు ఫస్ట్ టైమ్ నాని నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. మరి చూద్దాం నాని నెగెటివ్ పాత్రలో ఎలా మెప్పిస్తాడో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =