KGF2 లో విలక్షణ నటుడు..!

బాహుబలి సినిమా తర్వాత అంత రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా కేజిఎఫ్ అని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్ర రెండోవ భాగాన్ని చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్, టాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ లో తన డైలాగ్ డెలివరి తో, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకొని ఇండస్ట్రీ లో అగ్రనటులుగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడురావు రమేష్. ఏలాంటి పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు కేజిఎఫ్ చాప్టర్ 2 లో రావు రమేష్ కూడా నటించబోతున్నారు. ఈ విషయాన్నీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.


[custom_ad]

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేసి జులై 30 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి చూద్దాం ఇది ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో.మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.