‘రొమాంటిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Akash Puri Romantic Movie Release Date Confirmed

చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ కొట్టాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇక మిగిలింది తన కొడుకుకి ఒక మంచి హిట్ తెచ్చిపెట్టడమే. ఆకాష్ పూరీ హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు రాగా అవి నిరాశనే మిగిల్చాయి. తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. అందుకే తానే కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి ఆ భాధ్యతలు అప్పగించాడు. అనిల్ పాడూరి దర్శకత్వంలో ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రొమాంటిక్’. ఇక ఇప్పటీకే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ను బట్టి ఈ సినిమా ఎంత రొమాంటిక్ గా వుండబోతుందో తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. మే 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు.`ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.