టాలీవుడ్, కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సూపర్ హిట్ మూవీ “ఓ .. బేబీ ” తరువాత “జాను” మూవీ కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2” వెబ్ సిరీస్ తో సమంత ఫస్ట్ టైమ్ డిజిటల్ ప్లాట్ ఫారం లో అడుగుపెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో సమంత టెర్రరిస్ట్ గా నటించారు. స్టార్ హీరోయిన్ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసిన “జాను” మూవీ పాజిటివ్ టాక్ తో విజయవంతం గా దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




స్టార్ హీరోయిన్ సమంత మాట్లాడుతూ .. ఈ వెబ్ సిరీస్ లో ఫస్ట్ టైమ్ విలన్ గా నటించే ఛాన్స్ వచ్చిందని, తనను ఒక కొత్త అవతారంలో చూస్తారని, డూప్ లేకుండా స్టంట్ సీన్స్ లో పాల్గొన్నానని, ఇది తనకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అని, “ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2” వెబ్ సిరీస్ రిలీజ్ గురించి ఆసక్తి తో ఎదురు చూస్తున్నానని తెలిపారు. సమంత ప్రస్తుతం ఏ మూవీ అంగీకరించలేదు. బ్లాక్ బస్టర్ “RX 100” మూవీ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందనున్న “మహా సముద్రం” మూవీ కై సమంత తో సంప్రదింపులు జరుపు తున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























