ఆదర్శకుటంబం అక్టోబర్ 30న థియేటర్లోకి

Adarsha Kutumbam to Hit Theatres on October 30

విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47’ (AK 47) ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. పలుమార్లు పోస్ట్‌పోన్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 30న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని హీరో వెంకటేశ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలుత ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న, ఆ తర్వాత అక్టోబర్ 9న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే, సాంకేతిక పనులు మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కావడం వల్ల రిలీజ్ డేట్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని పనులను పూర్తి చేసుకుని అక్టోబర్ 30న దసరా కానుకగా అభిమానుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి బ్లాక్‌బస్టర్ క్లాసిక్స్ తర్వాత వెంకీ-త్రివిక్రమ్ కాంబో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ రీయునైట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ ‘చిట్టిబాబు’ అనే ప్యామిలీ మ్యాన్ పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నివేతా పేతురాజ్, నారా రోహిత్, డింపుల్ హయతి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ మరియు త్రివిక్రమ్ మార్క్ కామెడీ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.