ఎల్లమ్మ వచ్చేది ఎప్పుడంటే

Yellamma Release Date Locked

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’, జాతీయ అవార్డు గ్రహీత, ‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న వేణు యెల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. సాంస్కృతిక సంప్రదాయాల నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన కథగా ‘ఎల్లమ్మ’ను తీర్చిదిద్దుతున్నారు. దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను 2027 మార్చి 5గా ప్రకటించారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఎల్లమ్మ’ దేవిశ్రీ ప్రసాద్ కెరీర్‌లో ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది. ఇన్నాళ్లూ ప్రముఖ సంగీత దర్శకుడిగా ప్రేక్షకులను అలరించిన ఆయన, ఈ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయడంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. సంగీత దర్శకుడి నుంచి నటుడిగా మారుతుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ‘పర్షి’ పాత్రలో కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రకటించిన రిలీజ్ డేట్‌కు అనుగుణంగా చిత్రబృందం పనులు కొనసాగిస్తోంది. దర్శకుడు వేణు యెల్దండి సాంస్కృతిక సంప్రదాయాలు, కథనానికి భావోద్వేగాలను జోడిస్తూ ‘ఎల్లమ్మ’ను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

‘ఎల్లమ్మ’ 2027 మార్చి 5న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విభిన్నమైన కథాంశం, వేణు యెల్దండి దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా అరంగేట్రం చేస్తుండటంతో 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రముఖ పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఎల్లమ్మ’ ఒకటిగా నిలుస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.