మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధానపాత్రలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “V” మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు కాగా జగపతి బాబు, నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న “V” మూవీ లో హీరో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. సూపర్ హిట్ మూవీ “అష్టా చమ్మా” తో నాని ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి, నాని 25 వ మూవీ గా రూపొందుతున్న “V” మూవీ లో నెగటివ్ రోల్ లో నటింపజేయడం విశేషం. సుధీర్ బాబు ను రక్షకుడు గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈరోజు నాని ను రాక్షసుడు గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. చేతిలో కత్తెర తో, గడ్డంతో సీరియస్ గా ఉన్న నాని లుక్ ప్రేక్షకులను ఆకట్టుకొంది.
Killer Look 🔥🔥
Here’s the first look of @NameisNani, as రాక్షసుడు in #VTheMovie!@SVC_official @iSudheerBabu @i_nivethathomas@aditiraohydari @ItsAmitTrivedi@mokris_1772 @pgvinda #Rakshasudu pic.twitter.com/wrQqByPOMi— Telugu FilmNagar (@telugufilmnagar) January 28, 2020
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























