`నిన్ను కోరి`, `మజిలీ` రూపంలో రెండు వరుస విజయాలను అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ.. ఇప్పుడు తన తదుపరి సినిమాని నేచురల్ స్టార్ నానితో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. `టక్ జగదీష్` పేరుతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి 90ల నాటి ఓ హిట్ మూవీ ఆధారమని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ చిత్రమేమిటంటే… `బలరామకృష్ణులు`. అగ్రశ్రేణి కథానాయకులు శోభన్ బాబు, రాజశేఖర్ అన్నదమ్ములుగా నటించిన సదరు చిత్రం అప్పట్లో కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
[custom_ad]
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అందులో ఓ కీలక పాత్రలో నటించిన జగపతిబాబు ఇప్పుడు ఈ చిత్రంలో అన్న పాత్రలో కనిపించనుండడం విశేషం. ఏదేమైనా, `బలరామకృష్ణులు` ఆధారంగానే `టక్ జగదీష్` రూపొందుతుందో లేదో తెలియాలంటే మాత్రం సదరు సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. థమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నాయికలుగా నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























