`ఎఫ్ 2`, `వెంకి మామ`తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం `నారప్ప`తో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో వెంకీ దర్శనమివ్వనున్నారు. మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మే 1న రిలీజయ్యే దిశగా నిర్మాణం జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, ఈ సినిమా పూర్తయ్యేలోపే వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట. చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న ఆ చిత్రమే.. తరుణ్ భాస్కర్ కాంబినేషన్ మూవీ. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాని వేసవిలో ప్రారంభించి ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మలక్ పేట రేస్ కోర్ట్ లో సింహభాగం చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాని డి.సురేష్ బాబు నిర్మిస్తారు.
[custom_ad]
మరి.. 74వ చిత్రం `నారప్ప`తోనూ, పేరు నిర్ణయించని 75వ చిత్రంతోనూ ఈ ఏడాదిలో పలకరించనున్న వెంకీకి 2019 నాటి ఫలితాలే దక్కుతాయేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























