నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో రూపొందిన `గ్యాంగ్ లీడర్` చిత్రంతో నాయికగా తొలి అడుగేసింది ప్రియాంక అరుళ్ మోహన్. అందులో తన హోమ్లీ లుక్స్ తో కట్టిపడేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం రెండు ఆసక్తికరమైన చిత్రాలతో బిజీగా ఉంది. అంతేకాదు… మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నటించే అవకాశాన్ని దక్కించుకుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం శర్వానంద్ కి జోడీగా `శ్రీకారం` చిత్రంలో నాయికగా నటిస్తున్న ప్రియాంక.. మరోవైపు కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ కి జంటగా `డాక్టర్` సినిమాలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లోనూ అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనే నటిస్తోంది ప్రియాంక. ఈ చిత్రాలు నిర్మాణంలో ఉండగనే మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుందట. కోలీవుడ్ కథనాల ప్రకారం.. కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న `ఇండియన్ 2`లోనూ ప్రియాంక ఓ కీలక పాత్రకు ఎంపికైందట. మొత్తమ్మీద.. `గ్యాంగ్ లీడర్` భామ.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉందన్నమాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: