గత ఏడాది ముచ్చటగా మూడు చిత్రాలతో పలకరించిన నటసింహ బాలకృష్ణ.. ఈ సంవత్సరం ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో సందడి చేయనున్నారు. తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కాగా, రెగ్యులర్ షూటింగ్ ని ఫిబ్రవరి 15 నుండి ప్రారంభించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల ఇన్ ఫర్మేషన్. ఆపై నిరవధికంగా చిత్రీకరణ జరిపి జూలై ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని థియేటర్లలోకి తీసుకొచ్చే దిశగా ప్రణాళిక జరుగుతోందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… శ్రీకాంత్ ప్రతినాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది. యువ సంగీత సంచలనం థమన్ సంగీతమందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. త్వరలోనే `యన్.బి.కె. 106`కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























