సంపత్ నంది దర్శకత్వం లో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ నుకూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. జనవరి 27వ తేదీన ఉదయం 8.47 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో గోపీచంద్ ఆంధ్ర ప్రదేశ్ మహిళా కబడ్డీ కోచ్,తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: