`ప్యార్ ప్రేమ కాద‌ల్` రీమేక్ లో అల్లు శిరీష్‌?

Allu Sirish To Act In A Tamil Remake Movie

కెరీర్ ఆరంభంలో `కొత్త జంట‌`(2014), `శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు`(2016) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో అల‌రించిన యువ క‌థానాయ‌కుడు అల్లు శిరీష్‌.. గ‌త కొంత‌కాలంగా కాస్త ట్రాక్ త‌ప్పాడు. `ఒక్క క్ష‌ణం`(2017), `ఏబీసీడీ`(2019).. ఇలా శిరీష్ నుంచి వ‌చ్చిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో పెర్ ఫార్మ్ చేయ‌లేక‌పోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈ నేప‌థ్యంలో.. స్వ‌ల్ప విరామం అనంత‌రం మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడట‌ శిరీష్. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. త‌మిళ‌నాట విజ‌యం సాధించిన `ప్యార్ ప్రేమ కాద‌ల్`(2018)ని తెలుగు లో రీమేక్ లో చేయ‌నుండ‌గా.. అందులో హీరోగా న‌టించ‌నున్నాడ‌ట శిరీష్.

అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా `విజేత‌`(2018) చిత్రాన్ని రూపొందించిన రాకేష్ శ‌శి ఈ రీమేక్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నట్లు స‌మాచారం. కాగా, ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుందని అంటున్నారు. మ‌రి.. `కొత్త జంట‌`, `శ్రీ‌ర‌స్తు శుభ‌మస్తు` త‌ర‌హాలో ఈ సినిమా కూడా శిరీష్ కి గుర్తుండిపోయే ఫ‌లితాన్ని అందిస్తుందేమో చూడాలి.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =