మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘V’. ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా వుంది. ఇక మరోపక్క ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా చిన్న స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇక ఈసినిమాలో సుధీర్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చాడు. తన ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపాడు.
కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు … “రాక్షసుడు” ఎదిగిన నాడు ఒకడొస్తాడని ….. వాడే ఇప్పుడొస్తున్నాడు … “రక్షకుడు” వస్తున్నాడు 🔥👊 My 1st look is loaded and locked for Jan 27 ✌️ #VTheMovie #Rakshakudu @mokris_1772 @NameisNani @SVC_official
— Sudheer Babu (@isudheerbabu) January 21, 2020
[custom_ad]
కాగా ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటిస్తుండగా.. సుధీర్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఫస్ట్ టైమ్ నాని నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. మరి చూద్దాం నాని నెగెటివ్ పాత్రలో ఎలా మెప్పిస్తాడో..!
మరి నాని, ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇంతకుముందు అష్టా చమ్మా, జెంటిల్ మన్ చిత్రాలు రాగా అవి సూపర్ హిట్లు అయ్యాయి. మరి ఈ ‘వి’ తో ఈజోడి హ్యాట్రిక్ కొడతారో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: