సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కన్నడంలో రూపొందిన “కె జి ఎఫ్ చాప్టర్1” మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగ రాసిన విషయం తెలిసిందే. ఆ మూవీ కి సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ జులై లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, అనంత్ నాగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి.బి సంగీతం అందిస్తున్నారు. “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ కన్నడ భాష తో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన యశ్ , సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. హీరో యశ్ బర్త్ డే సందర్భంగా యశ్ సెకండ్ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. చేతిలో ఆయుధం తో, తీక్షణమైన లుక్ తో ఉన్న యశ్ సెకండ్ లుక్ పోస్టర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























