త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ‘సామజవరగమనా’, ‘రాములో రాములా’ ‘ఓ మై గాడ్ డాడీ’ పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. సామజవరగన, రాములో రాములా పాటలు 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమాలోని నాలుగో పాట ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. బుట్ట బొమ్మా అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ ను రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించగా అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఈ పాట కూడా ఆకట్టుకుంటుంది.
కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి జనవరి 12వ రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























