డ్రీమ్ వారియర్స్, వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా ” ఖైదీ ” మూవీ తమిళ, తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ” ఖైదీ ” మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను సత్య సాయి ఆర్ట్స్ కె కె రాధామోహన్ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు. ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
60 రాత్రులలో షూటింగ్ జరుపుకున్న ఈ ఎమోషనల్ డ్రామా ” ఖైదీ ” మూవీకి తెలుగు, తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ” ఖైదీ ” మూవీ లో హీరోయిన్, సాంగ్స్ లేకపోవడం విశేషం. కొత్త కాన్సెప్ట్ తో రూపొందే మూవీస్ కు ప్రేక్షకాదరణ ఉంటుందని ఈ మూవీ నిరూపించింది. హీరో కార్తీ నటించిన మూవీస్ లో 100కోట్ల క్లబ్ చేరిన మొదటి మూవీ” ఖైదీ “. హీరో కార్తీ త్వరలోనే “దొంగ “మూవీ తో ప్రేక్షకులనుఅలరించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: