రజినీ సినిమాలో నెగెటివ్ పాత్రలో..?

వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. 2018లో ‘కాలా’, ‘2.0’ చిత్రాలతో చేయగా.. ఇక ఈ ఏడాది ‘పేట’ సినిమాతో వచ్చారు. ఇక 2020లో రెండు సినిమాల‌తో అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌నున్నారు. ఇప్పటికే ఎ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘దర్బార్’లో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 2020 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత రజినీ కోలీవుడ్ స్టార్ అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్‌లో ఓ మూవీ చేయబోతున్నసంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను… ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకువెళ్ళి… 2020 దీపావళికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే ఖుష్బూ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో మీనా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. విశేషం ఏంటంటే ఈ సినిమాలో మీనా నెగెటివ్ రోల్ లో నటిస్తుందట. మరి గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ముత్తు’ సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఇప్పుడు నెగిటివ్ రోల్ లో నటిస్తుంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.