సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుతూనే.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కానీ విధంగా ఈ టీజర్ ఆల్ టైం రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇంకా ఈ టీజర్ నుండి బయటకు రాకముందే మరో అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. వచ్చే సోమవారం అంటే డిసెంబర్ 2వ తేదీన అప్ డేట్ ఇస్తున్నట్టు.. కీప్ గెస్సింగ్ అంటూ ట్వీట్ చేశారు. దీనితో అందరూ ఏం అప్ డేట్ ఇవ్వనున్నారబ్బా అని ఎవరి గెస్సింగ్ లు వాళ్ళు మొదలుపెట్టేశారు. అయితే ఎక్కువమంది మాత్రం ఫస్ట్ సింగిల్ కు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇవ్వోచ్చేమో అంటున్నారు.. చూద్దాం మరి ఏం అప్ డేట్ ఇస్తారో..!
Coming Up, Keep Guessing 😉 #SarileruNeekevvaru
— Sri Venkateswara Creations (@SVC_official) November 26, 2019
కాగా ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదలచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























