‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’, ఇలా వరుస పెట్టి హిట్స్ అందించిన సెన్సషనల్ డైరెక్టర్ తేజ. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘సీత’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ మధ్య తేజ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్టికల్ 370 ఇష్యూ. ఈ ఇష్యూ పై తేజ సినిమా తీయాలని చూస్తున్నాడు. అంతే కాదు తెలుగు హిందీ రెండు భాషల్లో కూడా ఈ సినిమా తీసే ప్లాన్ లో వున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకోసం తేజ మరో డేరింగ్ స్టెప్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ ను తీసుకురావాలని చూస్తున్నాడట. మెగా స్టార్ అంటే చిరంజీవి కాదులెండి… బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ను తీసుకురావాలన్న ఆలోచనలో వున్నాడట. అంతేకాదు అమితాబ్ కనుక ఓకే అంటే.. మరో లీడ్ రోల్ లో రాజ్ కుమార్ రావు ను కూడా తీసుకురావాలని చూస్తున్నాడట. మరి తేజ ప్లాన్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..
కాగా ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























