దేశవ్యాప్తంగా ఇప్పటీకే ఎంతో మంది ప్రముఖు నటీనటుల వాక్స్ స్టాచ్యూ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాతాలోకి తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా చేరిపోయాడు. తాజాగా విజయ్ మైనపు బొమ్మ ఏర్పాటు చేశారు. కన్యాకుమారిలోని మయపురి వండర్ వ్యాక్స్ మ్యూజియంలో విజయ్ వ్యాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్, స్టార్డమ్ తెచ్చుకున్న హీరో విజయ్.. ఇటీవల ‘బిగిల్’ (విజిల్) సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. విజయ్ ప్రస్తుతం ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మాళవిక మోహనన్ విజయ్‌తో జత కడుతుంది. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. 2020 వేసవిలో విడుదల చెయ్యనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























