మొత్తానికి చిరు కోడలు అనిపించింది ఉపాసన. తాను చేసిన ట్వీట్ మోడీ వరకు చేరిందంటే మాములు విషయం కాదు కదా మరి. అసలు సంగతేంటో గుర్తొచ్చేవుంటుంది కదా. ఇటీవల మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో సినీ తారలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది.. ఈ కార్యక్రమానికి సౌత్ నుండే ఎక్కువ నటీనటులు పాల్గొన్నారు. మన దక్షిణాది నుండి ఒక్క దిల్ రాజు తప్ప మరెవరు కనిపించలేదు. ఇక దీనిపై ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించి.. డైరెక్ట్ గా మోడీనే ప్రశ్నించింది. సినీ రంగం అంటే బాలీవుడ్ ఒక్కటే కాదని, భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దక్షిణాది చిత్ర పరిశ్రమలు కూడా దోహదం చేస్తున్నాయని పలువురు కేంద్రం వైఖరిని ప్రశ్నించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ట్వీట్ ఫైనల్ గా మోడీ వరకూ చేరిందనుకుంటా.. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ లను ప్రధాని మోదీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ తండ్రీతనయులు ఢిల్లీ వెళుతున్నారు. ఈ విషయాన్ని రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ప్రధాని నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే ప్రధానికి కలవబోతున్నట్లు రాంచరణ్ తెలిపాడు. మొత్తానికిఉపాసన ట్వీట్ బాగానే పనిచేసింది. ఇంకా ముందు మోడీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటారేమో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























