రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో విశ్వనాథ్ మాగంటి దర్శకుని పరిచయమవుతూ వస్తున్న సినిమా ‘తోలుబొమ్మలాట’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసే ప్లాన్లో వున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ట్రయిలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. నవంబర్ 1వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్ మాగంటి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్, దేవీ ప్రసాద్, నర్రా, శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి కుటుంబాలు,బంధాలు, అవసరాలు, అవకాశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. గతంలో కూడా ఈ నేపథ్యంలో ‘మీ శ్రేయోభిలాషి’ .. ‘ఆ నలుగురు’ వంటి గుర్తుండిపోయే సినిమాలు చేసాడు. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా కూడా రాజేంద్రప్రసాద్ కెరీర్ లో మరో గుర్తిండిపోయే సినిమా అవుతుందేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























