దర్శకరత్న దాసరి నారాయణరావు… భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని సంతకం. అత్యధిక చిత్రాలను రూపొందించిన దర్శకుడిగా అనితరసాధ్యమైన రికార్డును తన సొంతం చేసుకున్నారు దాసరి. మొత్తంగా 151 సినిమాలను తెరకెక్కించి… ఆల్ టైమ్ సెన్సేషన్ క్రియేట్ చేశారాయన. అలాంటి దాసరి కెరీర్లో 100వ చిత్రంగా `లంకేశ్వరుడు`కి ప్రత్యేక స్థానముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి తొలి కలయికలో వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్… కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా మ్యూజికల్‌గా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాజ్-కోటి సంగీతసారథ్యంలో రూపొందిన గీతాల్లో `జివ్వుమని కొండగాలి`, `పదహారేళ్ళ వయసు` ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.
చిరంజీవికి జోడీగా రాధ నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, రేవతి, రఘువరన్, కళ్యాణ చక్రవర్తి, కైకాల సత్యనారాయణ ముఖ్య భూమికలు పోషించారు. వడ్డే రమేష్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్… తెలుగులో యావరేజ్ గ్రాసర్ అనిపించుకున్నా తమిళంలో మాత్రం శతదినోత్సవం చూడడం విశేషం. 1989 అక్టోబర్ 27న విడుదలైన `లంకేశ్వరుడు` నేటితో 30 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























