‘సరిలేరు నీకెవ్వరు’ ఉదయం విజయశాంతి- సాయంత్రం మహేష్ బాబు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంట‌ర్ సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. తాజాగా విలన్ హౌస్ షెడ్యూల్‌ పూర్త‌య్యింది. చివరి షెడ్యూల్ కోసం నవంబర్ 1 నుంచి జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కేరళకు వెళ్లనుందట. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. దీపావళి సందర్భంగా రేపు ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ట్రీట్ ఇవ్వనున్నారు. ఉదయం 9.9 నిమిషాలకు విజయశాంతి లుక్ ను రిలీజ్ చేయనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు మహేష్ బాబు లుక్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.