ప్రభుదేవా-సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘వాంటెడ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు లో పోకిరి సినిమాను వాంటెడ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా పెద్ద సక్సెస్ కొట్టారు ప్రభుదేవా-సల్మాన్. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హీరో సల్మాన్ ఖాన్ చుల్ బుల్ పాండే గా నటించిన దబాంగ్ మూవీ ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మూవీ సీక్వెల్ దబాంగ్ 2 కూడా వచ్చింది. ఇప్పుడు దబాంగ్ మూవీ సిరీస్ లో భాగంగా దబాంగ్ 3 రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సల్మాన్ సరసన నాయికగా సోనాక్షి సిన్హా నటించింది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా సల్మాన్ ఓ వేదికపై మాట్లాడుతూ, పూరి జగన్నాథ్ తనతో సినిమా చేస్తానంటే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పాడు. అయితే గతంలో పోకిరి సినిమాతో సూపర్ హిట్ కొట్టడంతో పూరి పై సల్మాన్ కు మంచి నమ్మకం ఏర్పడిందంట. మరి పూరీ కి సల్మాన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడుగా. పూరీ స్టోరీ రాయడమే లేట్ లా ఉంది. చూద్దాం వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ గురించిన ప్రకటన ఎప్పుడు వస్తుందో..?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























