పుష్క‌ర‌కాలం పూర్తి చేసుకున్న ‘హ్యాపీడేస్‌’

Happy Days Movie Completes 12 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Happy Days Movie Updates,Happy Days Telugu Movie Latest News,Happy Days Movie Completed 12 Years,12 Years Completes Happy Days Telugu Movie,#HappyDays

ఫీల్ గుడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ‘ఆనంద్’, ‘గోదావరి’ వంటి ఫీల్ గుడ్ మూవీస్ తెర‌కెక్కించి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ సెన్సిబుల్ డైరెక్టర్ చేసిన తదుపరి ప్రయత్నమే ‘హ్యాపీడేస్’. కళాశాల నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కాలేజీ లైఫ్‌తో పాటు… అందులోని స్నేహాలను, ప్రేమలను తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరించారు శేఖర్. అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శేఖర్ కమ్ముల నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో… వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ్, గాయత్రిరావు, రాహుల్, సోనియా దీప్తి, వంశీ చాగంటి, మొనాలి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా… తమన్నా మినహా మిగిలిన వారంతా ఈ సినిమాతోనే నటులుగా తొలి అడుగులు వేయడం విశేషం. కమలినీ ముఖర్జీ కీలకపాత్రలో దర్శనమిచ్చిన ఈ చిత్రంలో… రణధీర్ గట్ల, ఆదర్శ్ బాలకృష్ణ, కృష్ణుడు తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి, వనమాలి, వెంకటేష్ పట్వారి కలం నుంచి జాలు వారిన పాటలకు మిక్కీ జే మేయర్ అలరించే బాణీలను స్వరపరిచారు. “అరెరే”, “జిల్ జిల్”, “హ్యాపీడేస్”, “యా కుందేందు”, “ఏ చీకటి”, “ఓ మై ఫ్రెండ్”… ఇలా ప్రతీ పాట విశేషాదరణ పొందింది. మూడు నంది పురస్కారాలతో పాటు… ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా కైవసం చేసుకున్న ఈ చిత్రాన్ని… కన్నడం(‘జాలీడేస్’), తమిళం(‘ఇనిదు ఇనిదు’) భాషల్లో కూడా పునర్నిర్మించడం విశేషం. 2007 అక్టోబర్ 2న విడుదలై ఘన విజయం సాధించిన ‘హ్యాపీడేస్’… నేటితో 12 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.