తెలుగు సినీ పరిశ్రమలో తన కామెడీతో మంచి పేరు సంపాదించుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి. కమెడియన్ గా మాత్రమే కాదు హీరోగా కూడా పలు సినిమాలో చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పడు తాజాగా మరో ప్రయోగం చేయనున్నాడు శ్రీనివాస్ రెడ్డి. దర్శకుడిగా మారి తానే కొత్త సినిమాను తీయనున్నాడు. ‘భాగ్యనగరవీధుల్లో’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కితుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. రేపు ఫస్ట్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing all the success to my dearest @Actorysr for #BhagyaNagaraVeedhulloGammathu , his debut as a director and producer..First look launch tomorrow 🤗🤗🤗 https://t.co/bXbHYWa7p6
— vennela kishore (@vennelakishore) September 27, 2019
కాగా ఈ సినిమాను సత్యం రాజేష్, సప్తగిరి, ధనరాజ్, వేణు, ప్రవీణ్ మరియు తాగుబోతు రమేష్ సంయుక్తంగా పెట్టిన ఫ్లైయింగ్ కలర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పరం సూర్యంషు కథను అందిస్తున్నాడు. సాకేత్ కొమండూరి సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























