సెప్టెంబ‌ర్ 28… మెగా ఎంట్రీ డే

September 28th – A Very Memorable Day For Ram Charan And Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pratibandh Movie Updates,Pratibandh Telugu Movie Latest News,Chirutha Movie Updates,Chirutha Telugu Movie Latest News,September 28th Special Day For Mega Family

సెప్టెంబ‌ర్ 28… మెగాభిమానుల‌కు వెరీ వెరీ స్పెష‌ల్ డే. ఎందుకంటే… అదే రోజున‌ వేర్వేరు సంవ‌త్స‌రాల్లో వేర్వేరు భాష‌ల్లో త‌మ తొలి అడుగులు వేశారు మెగాఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… తెలుగునాట నంబ‌ర్‌వ‌న్ క‌థానాయ‌కుడిగా తిరుగులేని ఫామ్‌లో ఉన్న‌ త‌రుణంలో… `ప్ర‌తిబంధ్‌`(1990)తో హిందీ చిత్ర‌సీమ‌లో తొలి అడుగులు వేశారు చిరంజీవి. తెలుగులో ఘ‌న‌విజ‌యం సాధించిన `అంకుశం`కి రీమేక్‌గా రూపొందిన `ప్ర‌తిబంధ్‌`… మెగా ఎంట్రీతో బాలీవుడ్‌లోనూ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

క‌ట్ చేస్తే… 17 ఏళ్ళ త‌రువాత అంటే 2007లో అదే తేదిన చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ `చిరుత‌`తో టాలీవుడ్‌లో క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించ‌డ‌మే కాకుండా… చ‌ర‌ణ్‌ని తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా ఆవిష్క‌రించింది. మొత్త‌మ్మీద‌… సెప్టెంబ‌ర్ 28 అటు చిరుకి, ఇటు చిరుత‌(రామ్ చ‌ర‌ణ్‌)కి వేర్వేరు భాష‌ల్లో మెగా ఎంట్రీకి వేదిక‌గా నిల‌చింద‌ని చెప్పాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 13 =