స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ ఈ రోజు
ఉదయం పది గంటలకు విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ సాంగ్ ను రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. ఇక అక్టోబర్ 8న దసరా స్పెషల్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.
Get ur Ear phones ready Guys ♥️🎧 #AVPLFirstSingle 🎹#avplunplugged 🎵#Samajavaragamana
Song from 10 AM
TomSung by @sidsriram
Lyrics by #padmashriseetharamasastry gaaruMy love to my team my director #Trivikram gaaru 🙌🏿@alluarjun ♥️@GeethaArts @haarikahassine pic.twitter.com/wan9zJ5tTp
— thaman S (@MusicThaman) September 27, 2019
కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
మరి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























