నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `ఎంత మంచివాడవురా`. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి `శతమానం భవతి` ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి స్థానం ఉందని… అందులో `జై సింహా` ఫేమ్ నటాషా దోషి సందడి చేయనుందని సమాచారం. మరి… గత ఏడాది సంక్రాంతికి `జై సింహా`లో నందమూరి బాబాయ్ బాలకృష్ణ సరసన ఆడిపాడి విజయాన్ని ఒడిసిపట్టుకున్న నటాషా… వచ్చే సంవత్సరం సంక్రాంతికి నందమూరి అబ్బాయ్ కళ్యాణ్ రామ్‌తోనూ ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























