ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది టాలీవుడ్ చందమామ కాజల్. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరో పక్క వేరే భాషల్లో కూడా సినిమా ఛాన్సులు కొట్టేస్తుంది. ఇప్పటికే తను నటించిన హిందీ క్వీన్ రీమేక్ ‘పారిస్ పారిస్’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇంకా కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `భారతీయుడు2`లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జతకట్టనుంది కాజల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

వీటితో పాటు బాలీవుడ్ లో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. సంజయ్ గుప్త దర్శకత్వంలో బాలీవుడ్ లో పలువురు సీనియర్ అండ్ యంగ్ హీరోలతో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఓ పెద్ద సినిమా తెరకెక్కబోతుంది. ‘ముంబై సగ’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కాజల్ .. జాన్ అబ్రహంతో రొమాన్స్ చేయనుందట. ఇంకా ఈ సినిమాలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, ప్రతీక్ బబ్బర్, గుల్షన్ గ్రోవర్, రోహిత్ రాయ్, అమోల్ గుప్తా ఇలా పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1980, 90 కాలం నేపథ్యంలో బొంబాయి పేరు ముంబయిగా ఎలా మారిందనేది ఈ సినిమా ద్వారా చూపించనున్నారట. మరి ఈ సినిమా కాజల్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























