ఇంకా రెండు రోజుల్లో సినీ లవర్స్ ఎంతగానో ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినిమాల్లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఆ సినిమాకు ఇంత రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు జరగలేదు. ఇక ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక సాహో టీం కూడా ఎక్కడా తగ్గకుండా రోజుకో అప్డేట్ ఇస్తూనే ఉంది. పాటలు, పోస్టర్లు ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సర్ ప్రయిజ్ లు ఇస్తున్నారు ఫ్యాన్స్ కు. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సాహో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా స్పెషల్ షో లకు కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ సినిమా కావడంతో సినిమా చూడటానికి జనాలు ఏ రేంజ్ లో వస్తారో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. దీని దృష్ట్యా స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వాలని సాహో నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఏపీ చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు చేసుకున్నారట. భారీగా ఉన్నడిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు సాహో స్పెషల్ షోలని ప్రదర్శించాలనుకుంటున్నాం. ఈ ఈనేపథ్యంలో రాత్రి 1:00 గంటల నుంచి ఉదయం 10:00 గంటల మధ్యలో రెండు ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని సాహో నిర్మాతలు దరఖాస్తులో కోరారట. సినిమాకు ఉన్నా క్రేజ్ ను చూసి సాహో ప్రత్యేక షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అఏపీ ప్రభుత్వం. దీనితో సాహో చిత్రాన్ని తొలి వారం రోజుకు 6 షోలు ప్రదర్శించనున్నారు.

కాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, లాల్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, ముఖేష్ మంజ్రేకర్, మందిరా బేడీ ఇలా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























