మహానటుడు నందమూరి తారక రామారావుకి, పంద్రాగస్టు (ఆగస్టు 15)కి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే… ఈ ప్రత్యేకమైన రోజున వేర్వేరు సంవత్సరాల్లో తారక రాముడు నటించిన నాలుగు చిత్రాలు విడుదల కాగా… వీటిలో మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆ సినిమాలే… `మంచి మనసుకు మంచి రోజులు`, `బందిపోటు`, `నిండు హృదయాలు`, `రౌడీ రాముడు – కొంటె కృష్ణుడు`.
`మంచి మనసుకు మంచి రోజులు` విషయానికి వస్తే… యన్టీఆర్ కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సి.ఎస్.రావు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. 1958 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని నమోదు చేసింది. అలాగే అందులోని `అనుకున్నదొక్కటి` పాట ఆ రోజుల్లో బహుళ ప్రజాదరణ పొందింది.
ఇక… యన్టీఆర్, బి.విఠలాచార్య కలయికలో రూపొందిన ‘బందిపోటు’ (1963) కూడా ఇదే తేదిన విడుదలై బ్లాక్‌బస్టర్ మూవీగా నిలచింది. ఇందులోని `ఊహలు గుసగుసలాడే`, `వగలరాణివి నీవే` పాటలైతే ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.
అలాగే యన్టీఆర్ కథానాయకుడిగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిండు హృదయాలు’(1969) కూడా ఇదే ఆగస్టు 15న విడుదలై ప్రజాదరణ పొందింది. అదే విధంగా యన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్లో కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘రౌడీరాముడు కొంటెకృష్ణుడు’(1980) కూడా ఇదే తేదీన విడుదలైంది.
కొసమెరుపు ఏమిటంటే… యంగ్‌టైగర్ యన్టీఆర్ హీరోగా నటించిన `యమదొంగ` (2007)లోనూ సీనియర్ యన్టీఆర్ స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్‌లో కనువిందు చేయడం… ఆ సినిమా కూడా ఆగస్టు 15నే విడుదలై ఘనవిజయం సాధించడం విశేషం.
ఇలా… పంద్రాగస్టున పసందైన వినోదాలు పంచి తెలుగు ప్రజానీకాన్ని విశేషంగా అలరించారు యన్టీఆర్.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.