స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇది అల్లు అర్జున్‌కి 19వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ముందు చెప్పినట్టే ఈ రోజు టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టైటిల్ తో పాటు ,ఫస్ట్ గ్లిమ్ప్స్ పేరుతో ఓ చిన్న టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. “అల,వైకుంఠపురంలో” అనే విభిన్నతతో కూడిన ఓ క్లాసిక్ టైటిల్, ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలా… వైకుంఠపురంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
[youtube_video videoid=hesTBbGRlaQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: