స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, నివేదా పెతురాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం కూడా తమ సినిమా సంక్రాంతికి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక విధంగా చెప్పాలంటే… బన్నీకి సంక్రాంతి లక్కీ సీజన్ అనే చెప్పాలి. ఎందుకంటే… గతంలో సంక్రాంతి సమయంలో వచ్చిన బన్నీ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ సినిమాలే `దేశముదురు`, `ఎవడు`. బన్నీ కథానాయకుడిగా నటించిన ‘దేశముదురు’ 2007 జనవరి 12న విడుదలై తొలి సంక్రాంతి విజయాన్ని అందివ్వగా… ఆ తరువాత సరిగ్గా ఏడేళ్ళకు అంటే 2014 జనవరి 12న బన్నీ అతిథి పాత్రలో నటించిన ‘ఎవడు’ విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలచింది. ఈ నేపథ్యంలో… ముగ్గుల పండగని ముచ్చటగా మూడోసారి టార్గెట్ చేసుకుని వస్తున్న అల్లు అర్జున్‌కి… ఈ సారి కూడా ఘనవిజయం దక్కుతుందేమో చూడాలి.
[youtube_video videoid=fCi_c7tZnC0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























