టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న సమంత… గత రెండేళ్లుగా నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌గా విడుదలైన ‘యూటర్న్’, ‘రాజుగారి గది 2’ చిత్రాలలో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… రేపు (జూలై 5న) విడుదల కానున్న ‘ఓ బేబీ’లో మరోసారి అటువంటి పాత్రలోనే దర్శనమివ్వనుంది. ఇదిలా ఉంటే… ఇప్పుడు తమిళంలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేయబోతోందట సామ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారతో ‘ఆరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’) అనే చిత్రాన్ని రూపొందించిన గోపీ నైనర్ దర్శకత్వంలో సామ్ ఓ సినిమా చేయబోతోందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్‌కి సామ్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని తమిళ సినీ వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో సామ్, గోపీ నైనర్ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడుతుందేమో చూడాలి.
కాగా… ప్రస్తుతం శర్వానంద్‌కు జంటగా తమిళ రీమేక్ చిత్రం ‘96’లో నటిస్తోంది సామ్.
[subscribe]
[youtube_video videoid=PF-vPViVXaI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























