పాన్ – ఇండియా యాక్టర్‌గా పేరుతెచ్చుకున్న రానా… ప్రస్తుతం పలు ఆసక్తికరమైన చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సోలో హీరోగా నటిస్తూనే… మరో వైపు మల్టీస్టారర్ మూవీస్‌లోనూ సందడి చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ప్రస్తుతం బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీస్ `హౌస్‌ఫుల్ 4` (అక్షయ్ కుమార్), `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` (అజయ్ దేవగణ్)లో నటిస్తున్న రానా… తాజాగా మరో మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే… సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో `కబాలి`, `కాలా` చిత్రాలను రూపొందించిన పా.రంజిత్… ప్రస్తుతం స్వాతంత్య్ర పోరాటయోధుడు బిర్సా ముండా జీవితం ఆధారంగా ఓ హిందీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మల్టీస్టారర్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాలో రానా ఓ కీలక పాత్ర పోషిస్తాడని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుందట. త్వరలోనే రానా, రంజిత్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.