మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ క‌పూర్‌

2019 Latest Telugu Movies News, Janhvi Kapoor Signs Another Interesting Project, Janhvi Kapoor Signs next project, Janhvi Kapoor Signs next movie updates, Janhvi Kapoor role in her next movie, Janhvi Kapoor got an intresting rolein her next film, Janhvi Kapoor upcoming projects, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Janhvi Kapoor Signs Another Interesting Project
అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన‌ జాన్వీ కపూర్… ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒక‌వైపు తొలి భార‌తీయ మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్ స‌క్సేనా జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ‘కార్గిల్ గర్ల్’లో న‌టిస్తూనే… మ‌రోవైపు రాజ్‌కుమార్ రావ్‌తో క‌ల‌సి హార‌ర్ కామెడీ మూవీ ‘రూహీ అఫ్జా’లోనూ న‌టిస్తోంది జాన్వి. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే తాజాగా మరో చిత్రంలోనూ నాయికగా ఎంపికైంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఆ వివరాల్లోకి వెళితే… అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహామ్‌, ప్రియాంక చోప్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘దోస్తానా’(2008)కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతోంది. ‘దోస్తానా 2’ పేరుతో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మించ‌నున్న ఈ సీక్వెల్‌లో కార్తిక్ ఆర్యన్ హీరోగా న‌టిస్తుండ‌గా… అత‌నికి జోడీగా జాన్వీ కపూర్ నటించనుందని తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా తెలియజేసాడు కరణ్ జోహార్. ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ కోలిన్ డుంచ దర్శకత్వం వహించనున్నాడు. కాగా… ఈ చిత్రాలతో పాటు కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హిస్టారిక‌ల్ డ్రామా ‘తక్త్’లోనూ కీలకపాత్ర పోషించ‌నుంది జాన్వి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా… ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ‌రి… క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీబీగా మారుతున్న జాన్వీకి… ఈ చిత్రాల‌తో మంచి ఫలితాలు దక్కాలని ఆశిద్దాం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=lDv8wGWOeQw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.