‘బంగార్రాజు’లో కీర్తి సురేష్?

2019 Latest Telugu Movie News, Keerthy Suresh Roped In As Female Lead For Naga Chaitanya, Keerthy Suresh New Movie News, Keerthy Suresh latest movie updates, Keerthy Suresh Next Project Details, Keerthy Suresh To Play An Female Lead For Naga Chaitanya next film, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Keerthy Suresh Roped In As Female Lead For Naga Chaitanya?

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ‘బంగార్రాజు’ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ కొన‌సాగింపు చిత్రం… తొలి భాగానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొంద‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలి భాగంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన నాగార్జున… ఈ సినిమాలో `బంగార్రాజు`గా టైటిల్ రోల్ పోషిస్తుండగా… అత‌ని మ‌న‌వ‌డి పాత్రలో నాగచైతన్య దర్శనమివ్వనున్నాడని టాక్‌. అంతేకాదు… ఈ సినిమాలో చైతు సరసన ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటించనుందని స‌మాచారం. కీర్తి ప్రధాన పాత్ర‌లో రూపొందిన ‘మహానటి’లో చైతూ అతిథి పాత్రలో కనిపించిన విషయం విదితమే. ఇప్పుడు అదే చైతూ సరసన కీర్తి హీరోయిన్‌గా నటిస్తుండడం విశేషం.

అలాగే… నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ ‘మన్మథుడు 2’ (‘మన్మథుడు’కి సీక్వెల్), ‘బంగార్రాజు’ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్)లో కీర్తి భాగమవడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరి… అక్కినేని తండ్రీకొడుకుల సరసన నటిస్తున్న ఈ వేర్వేరు చిత్రాలతో… కీర్తి ఏ మేరకు ప్రేక్ష‌కుల‌ను అలరిస్తుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=CxOHlegWpmQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.