బిజినెస్‌మ్యాన్‌గా స‌ల్మాన్ ఖాన్‌

2019 Latest Telugu Movie News, Bollywood Star Salman Khan latest movie news, Bollywood Star Salman Khan Turns Businessman, Salman Khan next film updates, Salman Khan next movie details, Salman Khan plays businessman role in next movie, Salman Khan to play US based businessman role in his next movie, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Bollywood Star Salman Khan Turns Businessman

ఇటీవల విడుదలైన ‘భారత్’తో మ‌రో ఘ‌న‌విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఒక‌ వైపు ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే… మరో వైపు తన తదుపరి చిత్రం ‘దబాంగ్ 3’లో నటిస్తున్నాడు స‌ల్లూ భాయ్‌. అంతేకాదు… ‘దబాంగ్ 3’ సెట్స్‌పై ఉండగానే… క్లాసిక్ డైరెక్ట‌ర్ సంజయ్ లీలా భన్సాలి కాంబినేష‌న్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు ఈ బాలీవుడ్ కండల వీరుడు. ‘ఇన్షా అల్లా’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో సల్మాన్‌కు జంటగా అలియా భట్ నటించనుంది. కాగా, ఆగ‌స్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… ‘ఇన్షా అల్లా’లో ఫ్లోరిడాకు చెందిన నలభై ఏళ్ళ బిజినెస్‌మాన్‌గా దర్శనమివ్వనున్నాడట సల్మాన్. అలాగే స‌ల్మాన్ లుక్ కూడా చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని బాలీవుడ్ ఖ‌బ‌ర్‌. ఆగస్టు మొదటి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో… ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ ఫ్లోరిడాలో లొకేషన్ల అన్వేష‌ణ‌కు స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. ఆపై శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… స‌ల్మాన్ ల‌క్కీ సీజ‌న్ అయిన రంజాన్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

మ‌రి… ‘ఖామోషి: ది మ్యూజికల్’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత స‌ల్మాన్ ఖాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలి రూపొందించ‌నున్న ఈ చిత్రం ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=hvS33iNEz5U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.