సూర్యకి జోడీగా పూజా హెగ్డే?

Latest Telugu Movies News, Pooja Hegde Next Film With Suriya, Pooja Hegde to Pair up with Suriya, Suriya And Pooja Hegde Pairing up, Suriya Upcoming Movie With Pooja Hegde, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Pooja Hegde to Pair up with Suriya

తెలుగునాట అగ్ర క‌థానాయ‌కులకు సూప‌ర్ జోడీగా దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (`రంగ‌స్థ‌లం`లో ప్ర‌త్యేక గీతం) వంటి స్టార్ హీరోల స‌ర‌స‌న సంద‌డి చేసిన పూజ… ప్ర‌స్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి జంట‌గా ఓ పిరియాడిక్ ల‌వ్ స్టోరీలో న‌టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా పూజ చెంత‌కు మ‌రో స్టార్ హీరో సినిమా ఆఫ‌ర్ చేరింద‌ని స‌మాచారం. అయితే, ఈ సారి వ‌చ్చిన అవ‌కాశం టాలీవుడ్ నుంచి కాదు… కోలీవుడ్ నుంచి. ఆ హీరో మ‌రెవ‌రో కాదు… మ‌న `గ‌జిని` సూర్య‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే… సూర్య క‌థానాయ‌కుడిగా `గురు` ఫేమ్ సుధ కొంగ‌ర `సూరారై పోట్రు` పేరుతో ఓ బ‌యోపిక్ రూపొందిస్తోంది. ఎయిర్ డెక్కన్ వ్య‌వ‌స్థాప‌కుడు కెప్టెన్ జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సూర్య‌కి జోడీగా న‌టించే ఛాన్స్ పూజ‌కి ద‌క్కింద‌ని కోలీవుడ్ టాక్‌. ఇప్ప‌టికే రెండో నాయిక‌గా `స‌ర్వం తాళ‌మ‌యం` ఫేమ్ అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టిస్తోంది. సూర్య స్వ‌యంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం… ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గ్రెగ్ పొవెల్ పర్యవేక్షణలో సూర్యపై కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నారని స‌మాచారం.

కాగా, క‌థానాయిక‌గా పూజ న‌ట‌నా ప్ర‌స్థానం తమిళ చిత్రం ‘ముగమూడి’(2012)తోనే మొద‌లైంది. అనంతరం తెలుగు, హిందీ చిత్రాల‌తో బిజీ అయిపోయిన పూజ‌… ఇప్పుడు ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌నుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. పూజ ఎంట్రీపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=TjO63KDdQJI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.