గోపీచంద్ స్పై థ్రిల్ల‌ర్‌కు ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌?

#Chanakya, Chanakya Movie Updates, Chanakya Telugu Movie Latest News, Gopichand New Movie Title Locked, Gopichand Spy Thriller Titled as Chanakya, Gopichand Upcoming Movie Title Confirmed, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Gopichand Spy Thriller Titled as Chanakya

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, తమిళ డైరెక్టర్ తిరు కలయికలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతున్న విషయం విదితమే. మెహరీన్, జ‌రీన్ ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో గోపీచంద్ బృందంపై కొన్ని యాక్షన్ సీన్స్‌ను షూట్ చేస్తున్నారని వినికిడి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో గోపీచంద్ స్పై ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడ‌ట‌. ఈ నేప‌థ్యంలో క‌థ రీత్యా ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని తెలిసింది. వాస్త‌వానికి గ‌త రెండు రోజులుగా ఈ సినిమాకి `బంగారు బుల్లోడు` అనే టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే, ఇప్ప‌టికే ఈ టైటిల్‌తో `అల్ల‌రి` న‌రేష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ దానికి సంబంధించిన‌ ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో… గోపీచంద్ చిత్రానికి `బంగారు బుల్లోడు` అనే టైటిల్ ప్ర‌చారంలోకి రావ‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఏదేమైనా… `చాణ‌క్య‌` టైటిల్‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. ఇక గోపీచంద్ 40వ పుట్టిన రోజు (జూన్ 12) సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

కాగా… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ స్పై థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

[youtube_video videoid=9jOVc1hBOEE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =