చేనేత ఆసు యంత్రాన్ని కనుగొన్న చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ‘మల్లేశం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమెడియన్ ప్రియదర్శి మల్లేశం పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాను జూన్ 21న విడుదల చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ విషయానికొస్తే మల్లేశం పాత్రలో చేసిన ప్రియదర్శి తన నటనతో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ చాలా బావోద్వేగంగా మనసుకి హత్తుకునేలా వుంది. ప్రియదర్శి తల్లి పాత్రలో ఝాన్సీ.. భార్యగా చేసిన అనన్య కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
కాగా స్టూడియో 99 ఫిల్మ్స్ బ్యానర్ పై రాజ్. ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ అధికారి నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి బాలు శాండిల్యస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=nmaKuf64I1I]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























