మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన 6 సినిమాలు 2019 సంవత్సరంలో రిలీజ్ కానున్నాయి. తమన్నా నటించిన కామెడీ హారర్ తమిళ మూవీ దేవి (అభినేత్రి ) సీక్వెల్ దేవి 2( అభినేత్రి 2) , సూపర్ నేచురల్ హారర్ హిందీ మూవీ ఖామోషి మే 31 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు మూవీస్ లోనూ ప్రభుదేవా, తమన్నా జంటగా నటించడం విశేషం. ఖామోషి హిందీ మూవీ రిలీజ్ జూన్ 14 తేదీకి పోస్టుపోన్ అయింది. దేవి 2 మూవీ లో విలేజ్ హౌస్ వైఫ్ గానూ ఖామోషి హిందీ మూవీ లో బధిర యువతిగానూ తమన్నా నటించారు. బధిర యువతి గా నటించడానికి 4 రోజులు వర్క్ షాప్ లో పాల్గొన్నానని, సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నానని తమన్నా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ క్వీన్ హిందీ మూవీ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక సైరా మూవీ గురించి తమన్నా స్పందన ఆమె మాటల్లోనే ..భారీ బడ్జెట్, భారీ తారాగణం తో తెరకెక్కుతున్న స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి బయోపిక్ సైరా నరసింహా రెడ్డి మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నానని, బ్రిటిష్ వారితో పోరాడే నరసింహా రెడ్డి కి సహాయపడతానని, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, చిరంజీవి లతో స్క్రీన్ షేర్ చేసుకొనడం గొప్ప గౌరవం గా భావిస్తున్నానని, చిరంజీవి తో నటించడం ఫస్ట్ టైమ్ అని అన్నారు. రాజుగారి గది , ఆనందో బ్రహ్మ రీమేక్ లో నటిస్తున్నానని తెలుపుతూ , 24 గంటలు వర్క్ చేయడానికి ఇష్టపడతానని, ఈ సంవత్సరం తాను నటించిన 6 మూవీస్ రిలీజ్ కావడం సంతోషంగా ఉందని తమన్నా తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=bPHYrP8kHvw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























