మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహర్షి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు ఈ సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇప్పటికే ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’ ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే’ అన్న పాటలు విడుదలవ్వగా.. వాటికి అద్భుతమైన స్పందన వస్తోంది.
ఇక తాజాగా ఫోర్త్ సింగిల్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘పదర పదర’ అనే పాటను 24వ తేదీ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 9న సమ్మర్ స్పెషల్‌గా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు.
[subscribe]
[youtube_video videoid=E_nsZAGJHOM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























