సీత కష్టాలు అన్నట్టు సీత సినిమాకు రిలీజ్ కష్టాలు మాత్రం తప్పట్లేదు. షూటింగ్ ను ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈసినిమా ఇప్పటివరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ఇక ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే అందుతున్న సమాచారం మేరకు అదీ కష్టమే అని తెలుస్తోంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని మళ్లీ వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ నెలలో మజిలీ, చిత్రలహరి, జెర్సీ డబ్బింగ్ సినిమా అయినా కంచన 3 కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఈ టైంలో సినిమాను రిలీజ్ చేస్తే కష్టమనే యోచనలో ఉన్నారట. ఇక ఈ వారం ‘ఎవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ టైంలో సినిమా రిలీజ్ చేస్తే కష్టమని.. ఇక మే నెలలో మహర్షి లాంటి పెద్ద సినిమా ఉంది.. దాంతో మే 24వ తేదీ అయితే ఎలాంటి అడ్డంకి లేకుండా ఉంటుందని ఆరోజు రిలీజ్ చేయనున్నారట. మరి ఆ రోజైనా రిలీజ్ అవుతుందో..? లేదో? చూద్దాం..
కాగా తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో మన్నారా చోప్రా, సోనూ సూద్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అనిల్ సుంకర, కిషోర్ గరికపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid= lBi8ocJHLuc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























