రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ఆకాశవాణి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దగ్గర చాలా సినిమాలకు పనిచేసిన కార్తికేయ ‘షోయింగ్ బిజినెస్’ పేరుతో సొంత బేనర్ స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇక గత కొద్దికాలంగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పక్కా ప్లానింగుతో ముందుగా అనుకున్న ప్రకారం చాలా తక్కువ రోజుల్లో ఈ సినిమాను షూటింగ్ ను పూర్తి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజమౌళి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరక్టర్ లో ఒకడైన అశ్విన్ గంగరాజు ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు కీరవాణి కొడుకు కాలభైరవ ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. సముద్రఖని ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తయిన్ విషయాన్ని అశ్విన్ గంగరాజు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ చిత్రానికి సౌండ్ డిజైన్: రఘునాథ్.కె, కాస్ట్యూమ్స్: సంజనా శ్రీనివాస్, కాస్టింగ్ డైరెక్టర్: మహతి బిక్షు, ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ నాథ్, ఎస్.బింగి, లైన్ ప్రొడ్యూసర్: శశాంక్, స్క్రీన్ ప్లే: అశ్విన్ గంగరాజు, సందీప్ రాజ్, సాయికుమార్ రెడ్డి, నిర్మాత: ఎస్.ఎస్.కార్తికేయ, దర్శకత్వం: అశ్విన్ గంగరాజు.
[subscribe]
[youtube_video videoid=A9B0egvDDjo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: