తమిళ డైరెక్టర్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 96 సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు గతకొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకొని తెలుగులో నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ని స్టార్ట్ చేసి… ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ రీమేక్ లో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిగిలిన నటీనటుల విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సినిమాకి తమిళ వెర్షన్ డైరెక్టర్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.


[youtube_video videoid=3DUXiGluVjo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























