అల్లు శిరీష్ కి ఆ సెంటిమెంట్ ప్లస్ అవుతుందా?

Will That Sentiment Be A Plus Point For Allu Sirish,2019 Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,Allu Sirish New Movie,Allu Sirish Latest News,Allu Sirish Sentiment Plus Point for New Movie,Allu Sirish New Movie ABCD

2013లో విడుదలైన ‘గౌరవం’ చిత్రంతో కథానాయకుడుగా తొలి అడుగులు వేశాడు అల్లు శిరీష్. ఆ సినిమా నిరాశపరిచినా… మారుతి డైరెక్షన్లో వచ్చిన ‘కొత్తజంట’ తో తొలి విజయాన్ని చవి చూశాడు శిరీష్. ఆ తరువాత ‘శ్రీరస్తు శుభమస్తు’ రూపంలో మరో విజయం దక్కింది. అయితే గత చిత్రం ‘ఒక్క క్షణం’ మాత్రం అనుకున్నంత సక్సెస్ అందించలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో… కొత్త చిత్రం ‘ఏ బి సి డి’ పై ఆశలను పెట్టుకున్నాడు ఈ మెగా క్యాంప్ హీరో. మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… మే నెలకి శిరీష్ కి మంచి అనుబంధమే ఉంది. మే 30 శిరీష్ పుట్టినరోజు కాగా… అతని తొలి విజయాన్ని అందించిన ‘కొత్తజంట’ (2014) కూడా అదే నెలలో (మే 1) రిలీజ్ అయ్యింది. మరి ఈ నేపథ్యంలో… మే సెంటిమెంట్ ఫలించి ‘ఏ బి సి డి’ రూపంలో శిరీష్ కి మరో హిట్ దక్కుతుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=6Zbv6Qw_Xd4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − twelve =